https://www.youtube.com/watch?v=dN_jD-1EtTc
రవికిరణాలు (నెల్లూరు - స్టాఫ్ రిపోర్టర్ చందు) : నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిపై మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు నాయుడికి మతిస్థిమితం సరిగా లేదని కర్నూలు లో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. తాను వేసిన రోడ్లమీద నడవొద్దు, తాను ఇస్తున్న ఫించన్ తీసుకొవద్దంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు నగర ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల శవాల పై వ్యాపారం చేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడంటూ దుయ్యబట్టారు. రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం రాజులని తరిమికొట్టిన విధంగా చంద్రబాబు ని, లోకేష్ ని తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. నిన్న మామకు వెన్ను పోటు పొడిచిన బాబు నేడు రైతులకు, మహిళలకు వెన్ను పోటు పొడుస్తున్నాడన్నారు. వైసీపీ కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టిన అందరు నాయకులని పేరు పేరునా గుర్తు పెట్టుకుంటామన్నారు. చంద్రబాబును ఆయన రాజకీయ అగోరాగా అభివర్ణించారు.

No comments: