రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తెలుగు సినీ పరిశ్రమ లో మాదక ద్రవ్యాలకు బానిసలౌతున్నవారి సంఖ్య రోజురోజుకు
పెరుగుతుండడం చాలా బాధ కలిగిస్తోందని నటుడు రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో దర్శించుకున్న రాజేంద్రప్రసాద్ కు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. దర్శనాంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటివల టాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుందని రాజేంద్రప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. సెకండ్ గ్రేడ్,థర్డ్ గ్రేడ్ నటీనటులు ఈ డ్రగ్స్ మత్తుకు అలవాటు పడుతున్నారన్నారు. జీవితంలో ఎదో సాదిస్తామని సినీ పరిశ్రమ లోకి వచ్చిన వారికి సరైన అవకాశాలు లేకపోవడంతో మానసిక ఆందోళనకు గురై డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారన్నారు. నాకు ఒక అవకాశం ఇస్తే వీరికి సరైన కౌన్సిలింగ్ ఇస్తానని మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు,నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

No comments: