రవికిరణాలు(తిరుపతి) : ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే జగన్ ఇచ్చిన 9 హామీలను ఎలా నెరవేరుస్తామో వైసిపి ఎమ్మెల్యే ఆర్ కే.రోజా వివరిస్తామన్నారు. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు
వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. జగన్ 9 హామీలను ఎలా నెరవేరుస్తారో చర్చకు రండంటూ తెలుగుదేశంపార్టీ మంత్రులు ఇచ్చిన సవాల్ కు తాము సిద్థమన్నారు. అబద్థాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనని అబద్ధాల్లో బాబుకు నోబుల్ అవార్డు కూడా ఇవచ్చని విమర్సించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్ పై విమర్సలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని రోజా దుయ్యబట్టారు. పౌష్టికాహార
లోపంతో జనాలు చచ్చిపోతుంటే ఆ విషయాన్ని పట్టించుకోని పరిటాల సునీత ప్రతిపక్ష నేత జగన్ పై విమర్సలు చేయడమే
పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. వైసిపి సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంటే అధికారపార్టీకి వెన్నులో
భయం పట్టుకుందని, తాము ఎవర్ని సలహాదారుడిగా పెట్టుకుంటే తెలుగుదేశంపార్టీ నాయకులకి ఎందుకని ప్రశ్నించారు. మహిళలు ఉద్యమిస్తున్న మద్యపాన నిషేధంపై నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణిలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

No comments: