నెల్లూరు నగరంలోని బ్రహ్మానందపురంలో మద్యం దుకాణం పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.నగరంలోని 36వ డివిజన్ బ్రహ్మానందపురంలో మద్యం దుకాణం పెట్టడానికి వీల్లేదంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. బొల్లినేని సమీపంలోని మినర్వా హోటల్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రికి అతి దగ్గరలో మద్యం దుకాణం ఎలా ఏర్పాటు చేస్తారంటూ మహిళలు మండిపడ్డారు. మద్యం దుకాణం ఏర్పాటుకు ఇచ్చిన లైసెన్సును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల ఆందోళనకారులతో మాట్లాడి ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

No comments: