రవికిరణాలు(నెల్లూరు-చందు): నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్లో ఉన్న అనిల్ గార్డెన్స్‌లో వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం ఘనంగా జరుగుతోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి పర్వవేక్షణలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరయ్యారు. భారీ స్థాయిలో జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమావేశంలో ముందుకు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
[gallery td_select_gallery_slide="slide" ids="331,330,329,328,332"]
[gallery td_select_gallery_slide="slide" ids="331,330,329,328,332"]
No comments: