ఇది నిజమెనా లేక గ్రాఫిక్స్ మాయా...... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఇది నిజమెనా లేక గ్రాఫిక్స్ మాయా......

రవికిరణాలు ( తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో గ్ర‌హాంత‌ర‌వాసులు ఉన్నారా ? ఆదిలాబాద్ ప్రాంతం నిర్మ‌ల్ జిల్లా జిన్నారం అడ‌వుల్లోని అట‌వీ శాఖఅధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొరికిన విజువ‌ల్స్ ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌రుస్తున్నాయి. ఆదివారం రాత్రి జిన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చ‌నిపోయి క‌నిపించాయి. ఇటీవ‌ల త‌రచుగా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి .దీనిపై స్పందించిన అట‌వీ సిబ్బంది. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం రాత్రి 12 గొర్రెలు చ‌నిపోయాయి. దీన్ని ఎంక్వ‌యిరీ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా క‌ళ్లు బైర్లు క‌మ్మేశాయి. ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఫొటోల్లో ఓ వ్య‌క్తికి సంబంధించిన అతి పెద్ద పాదం క‌నిపించింది. అది మామూలు వ్య‌క్తికి ఉన్న‌ట్లు లేదు. ఆదిమాన‌వుల ఆన‌వాళ్ల‌తో పాదం, కాలు వేళ్లు ఉన్నాయి.మ‌రికొన్ని విజువ‌ల్స్ లో గ్ర‌హాంత‌ర వాసుల‌ను పోలిన వ్య‌క్తులు క‌నిపించారు. నెత్తిన రెండు కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్లు ఉన్నాయి. వేటాడే రూపంలో ఉన్నాయి. జిన్నారం అడ‌వుల్లో సీసీ కెమెరాకి చిక్కిన వీళ్ల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. అస‌లు వీళ్లు ఎవ‌రు అని చ‌రిత్ర‌కారులు పరిశోధ‌న‌లు చేస్తున్నారు.
ఇది నిజమెనా లేక గ్రాఫిక్స్ మాయా...... Reviewed by CHANDRA BABU on July 03, 2017 Rating: 5 రవికిరణాలు ( తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో గ్ర‌హాంత‌ర‌వాసులు ఉన్నారా ? ఆదిలాబాద్ ప్రాంతం నిర్మ‌ల్ జిల్లా జిన్నారం అడ‌వుల్లోని అట‌వీ శాఖఅధికా...

No comments: